మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సినీ నటి హేమ

  • కేటీఆర్ పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు
  • హీరోయిన్ల జీవితాలను నాశనం చేస్తున్నారన్న సురేఖ
  • సినీ రంగంలో ఉన్న మహిళలకు గౌరవం ఇవ్వాలన్న హేమ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటీఆర్ వల్ల హీరోయిన్ల జీవితాలు నాశనం అయ్యాయనే విధంగా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సురేఖ వ్యాఖ్యలు ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలో సైతం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, ప్రకాశ్ రాజ్ ఖండించారు. 

తాజాగా సినీ నటి హేమ స్పందిస్తూ... ఇతర రంగాల్లో పని చేసే మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో... అలాంటి గౌరవాన్నే సినీ రంగంలో ఉన్న మహిళలకు కూడా ఇవ్వాలని అన్నారు. ఇండస్ట్రీలో పని చేసే అడవాళ్లకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని చెప్పారు.

Hema
Tollywood
Konda Surekha
Congress
KTR
BRS

More Telugu News